రైల్వేకోడూరు నియోజకవర్గానికి బాసటగా రైల్వే కోడూరు మండల ప్రాంతంలో కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా దినకర్బాబు మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా అధికార, అనధికార లెక్కల ప్రకారంగా రెండు వందల నుండి ఐదు వందల కేసులు వరకు కోవిద్ బాధితులు ఉన్నారని తెలిపారు. వీరు అందరూ సరైన చికిత్స పొందాలి అంటే కడప జిల్లా అయిన రైల్వే కోడూరుకు జిల్లా కేంద్రం దూరమని తిరుపతి ప్రాంతం దగ్గరగా ఉందని వెలుతున్నారు. కానీ, తిరుపతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లు మరియు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా బెడ్స్ ఖాళీ లేవంటూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కాబట్టి, రైల్వేకోడూరు ప్రజానీకానికి అండగా ప్రభుత్వం గతంలో చేసిన విధంగా తప్పనిసరిగా కొవిడ్ సెంటర్ ను కోడూరు ప్రాంతవాసులు కోసం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ విన్నవించుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయలేని పక్షంలో ప్రత్యామ్నాయాలను చూపించాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం శ్రీను, మాదా సుబ్రహ్మణ్యం, చవాకుల రెడ్డి మనీ, ఎర్ర రెడ్డయ్య, కల్వకుంట చంగల్ రాయులు , అనంత రాయలు , కిషోర్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.