Logo
Date of Publish : 02 January 2026, 6:45 pm
Editor : Sake Naresh

నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేకు జనసేన నాయకుల శుభాకాంక్షలు

కళ్యాణదుర్గం, జనవరి 02, (జనస్వరం) : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం జనసేన నాయకులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సురేంద్రబాబు సమర్థవంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థంగా అందాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అందరి శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగరాజు, ఆంజనేయులు, జాకీర్ హుస్సేన్, వీరమహిళలు మమత, కల్పన, టీడీపీ మాజీ కౌన్సిలర్ అమర బిందు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com