– ముప్పైఐదు ఏళ్లుగా డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు:
– యన్ లక్ష్మిరెడ్డి పల్లి గ్రామ వాస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి:
– నాటి ప్రభుత్వాలు చేతగాని తనం అనుకుంటే, నేటి ప్రభుత్వం ఏమైంది? ఏం చేస్తా ఉంది :
– లేకపోతే ఫిబ్రవరి 2వ తేది నుండి నిరాహార దీక్ష : జనసేన నేత Dr యుగంధర్ పొన్న.
గంగాధర నెల్లూరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మల్లేపల్లి గ్రామ పంచాయతి నెల్లేపల్లి గ్రామ పంచాయతీ, యన్ లక్ష్మిరెడ్డి పల్లి గ్రామంలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివాసమున్న గ్రామంలో గత 35 సంవత్సరాలుగా డ్రైనేజీ కాలువలు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు నీరు ప్రతినిత్యం ఏడు వీధుల గీత ప్రవహిస్తూ ఉండడంవల్ల, తరచూ ఈ గ్రామంలోని పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న వారు అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యన్ లక్ష్మిరెడ్డి పల్లి గ్రామలో ఏడు వీధులలో డ్రైనేజీ నిర్మించాలి. డ్రైనేజి నిర్మాణం చేపట్టకపోతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతగాని ప్రభుత్వం అని వైసిపి నిరూపించుకుంటూ ఉందని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే కోట్లు తప్ప, ఇంకేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ కార్యక్రమంలో గంగాధరనెల్లూరు మండల్ అధ్యక్షులు జైపాల్ రాజు, ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రధాన కార్యదర్శి సూర్య, జనసేన నాయకులు జయరాజ్, జనసైనికులు చింటూ, సురేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.