విశాఖలో క్యాన్సర్ తో బాధపతున్న సాయి ప్రియకు రూ.35,000 ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు
విశాఖపట్నంలోని 88వ వార్డ్ వెదుళ్ళ నరవ E గంగవరం కాలనీ నందు బేబీ సాయి ప్రియ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వారి తల్లిదండ్రులు 3 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. ఫలితం లేదు. ఉన్నత వైద్యం కోసం చెన్నై వెళ్ళవలసి ఉంది. కానీ వారి దగ్గర ఆర్థిక స్తోమత లేదు అని తెలుసుకొని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో 88వ వార్డ్ జనసేన పార్టీ నాయకులు 35000/- ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. జనసేనాని సూచనల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహాయం అందించిన వారు వబ్బిన జనార్ధన్ శ్రీకాంత్, గల్లా రమేశ్, గండ్రెడ్డి అశోక్ కుమార్, దువ్వాడ కుమార్, సరపసిల్లి అప్పారావు, కర్రి హనుమంతరావు, దువ్వాడ మురళి, బొబ్బిలి శ్రీనివాసరావు సహాయం ఇచ్చారు.