అంతర్వేది దేవస్థానం కి చెందిన దివ్యాంగురాలు అయిన బొమ్మిడి పెద్ధింట్లు గారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ” జనం కోసం మనం జనసేన” రాజోలు కువైట్ గ్రూప్ వారు రు.10,000/- అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటున్న కువైట్ జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించడం ఆనందదాయక౦ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు గారు, భైరా నాగరాజు, రేకపల్లి నాగరాజు, యెనుముల రవి, మేడిచర్ల రామకృష్ణ, యెనుముల లక్ష్మణ్ గారు, యెనుముల ప్రసాద్, మణికంఠ పాల్గొన్నారు. జనం కోసం మనం జనసేన రాజోలు గ్రూప్ ని సఖినేటపల్లి SI గోపాల కృష్ణ గారు మరియు మలికపురం SI నాగరాజు గారు అభినందనలు తెలియచేశారు.