Logo
Date of Publish : 23 March 2022, 5:02 pm
Editor : Sake Naresh

హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న జనసేన నాయకులు

     ములకలచేరువు, (జనస్వరం) : మన సనాతన హిందూ ధర్మాలను జానపద గేయ భజనల రూపంలో తరువాతి తరం వాళ్లకు అందిస్తూ ఎన్నో భజన బృందాలను ఏర్పాటు చేసి, తిరుమల కొండ మీద భజనలు చేయిస్తున్నది మన జానపద కళాకారుల సంఘం. అన్నమాచార్యుల వారి వారసులు ఈ సంఘంలోని కళాకారులని సన్మానించే కార్యక్రమం మండల వారిగా చేపడుతున్నారు. పెద్దపాళ్యం ఆంజనేయస్వామి ఆలయంలో సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ములకలచేరువు మండల భజన బృందాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ధర్మానికి మన వంతు సహాయం చేయడానికి, పెద్దపాళ్యం కామాక్షి అంజి గారి ఆలోచనతో, ములకలచేరువు మండల జనసేన అధ్యక్షులు సాయినాథ్ గారి ఆధ్వర్యంలో భజన బృందాలకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శులు కిరణ్ రాయపు, సుదర్శన్, సురేష్, శ్రీధర్, నరేష్, అమర, రామాంజులు, సుబ్బరామ్, ప్రభాకర్ నాగరాజు, జనసేన కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com