విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గం, 64వ వార్డు, యారాడ గ్రామంలో సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో యారాడ గ్రామ ప్రజలకి ఈ కరోనా సమయంలో వారి ఆరోగ్య దృష్ట్యా మాస్కులు, శానిటైజర్, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన నాయకులు 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద రెడ్డి గారు చేతుల మీదగా ప్రజలకి అందజేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పని అయితే తప్ప బయటకి వెళ్లకూడదని మాస్కులు ధరించాలని కోరారు. శానిటైజర్ ఎప్పటికప్పుడు రాసుకోవాలని, మరీ ముఖ్యంగా భౌతిక దూరం పాటించి మీరు ఆరోగ్యంగా ఉండి మీ తోటి వారిని ఆరోగ్యంగా ఉండేలా చేయాలని తెలియజేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యారాడ గ్రామ నాయకులు, ప్రజలు, పెద్దలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
వీటిని కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com