తిరుపతి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లాఅధ్యక్షుడు హరిప్రసాద్ ఆదేశాల మేరకు తిరుపతిలో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో ఆహార పొట్లాలను జనసేన నాయకులు అందజేయడం జరిగినది. జనసేన నాయకులు మాట్లాడుతూ నీరు ప్రవహించక ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయి నగరం మొత్తం నీటితో నిండిపోతుంది. స్థానిక నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని రాబోయే విపత్తులను దృష్టిలో ఉంచుకొని కాలవల దురాక్రమణలు తొలగించి చినుకు పడితే నీటి ఎద్దడి కాకుండా నగరాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. తుఫాన్ బాధితులకు జనసైనికులు అఅందరూ కూడా తమవంతు సహాయకారిగా నిలబడ్డారు. ఎక్కడైనా ఆహారం, నీరు అందక ప్రజల ఇబ్బందులో ఉంటే తమ దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, తిరుపతి పట్టణ ప్రధాన కార్యదర్శి దినేష్ జైన్, తిరుపతి పట్టణ కార్యదర్శి రాజేష్ ఆచారి, రాజేష్ నాయక్, గని, నాగరాజు, రామేశ్వర్, జన సైనికులు హాజరయ్యారు.