Logo
Date of Publish : 19 April 2023, 3:54 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేన నాయకులు

     నెల్లూరు, (జనస్వరం) : కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వినాయక కాలనిలో కొద్దిరోజుల క్రితం అగ్నిప్రమాదం కారణంగా ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, జనసైనికులతో కలసి నిత్యావసర సరుకులు,బియ్యం బస్తాలు అందజేశారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్  మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఇప్పటికి ఆధార్ కార్డులు లేకపోవడంతో, అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరం అన్నారు. కానీ కొందరికి మాత్రం ఓటర్ కార్డులు ఉన్నాయని, ఓట్లు కోసమే గిరిజనులను ఉపయోగించుకుంటూ, ప్రభుత్వ పథకాలు అందించకపోవడం దారుణమని, అధికారులు స్పందించి గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుని గిరిజనులకు పక్కా ఇల్లు కట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, కార్యదర్శి ప్రశాంత్, మౌనేష్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com