విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, మత్స్యకార గ్రామం గంగవరం గత పది సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేని గ్రామంగా మిగిలిందని ప్రజలు నిత్యం మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రజలకు మంచినీటి సరఫరా కొరకు మంచినీటి ట్యాంకర్లను గంగవరం గ్రామానికి పంపించాల్సిందిగా, అలాగే వీధి వీధి కి మంచినీటి బోర్లు వేయాలని, గంగవరం గ్రామానికి స్మశాన వాటిక లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే స్మశాన వాటికను నిర్మాణం చేయాలని, సి.సి రోడ్లు,కాలవలు, సీ.సీ కల్వర్టులు నిర్మాణం చేయవలసిందిగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన గౌరవ విశాఖ మేయర్ తక్షణమే మీరు కోరిన పనులు గంగవరం గ్రామానికి చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com