సత్తుపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బండి నరేష్ గారి ఆధ్వర్యంలో వేంసూరు మండలంలో ఉన్నటువంటి శంభుని పాలెం, బీరంపల్లి విద్యార్థులు సమయానికి తగ్గట్టు బస్సులు నడపడం లేదని విద్యార్థులు కాలేజీకి సకాలంలో వెళ్లే విధంగా సమయానుకూలంగా బస్సు నడపాలని సత్తుపల్లి డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిపో మేనేజర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి విద్యార్థులకు కాలేజీకి సమయానుగులుగా రేపటి నుండి బస్సులు నడుపుతామని టైం టేబుల్ సెట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శరత్, ఆళ్ల నరేష్, జబీర్, ఆదిత్య, భాష తదితరులు పాల్గొన్నారు.