పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నందు టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేయడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గం నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, మధ్యాహ్నం మూడున్నర గంటలకు మార్కెట్ కి వెళ్లి, టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయని మొదట రైతులతో మాట్లాడడం జరిగిందన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ ముందు బైపాస్ రోడ్డు నందు టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రభుత్వమే టమోటాలను కొనాలని చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ బైపాస్ రోడ్డు నందు ధర్నా చేశారు. మార్కెట్ యార్డ్ కి సంబంధించిన అధికారులు వారి దగ్గరకు వచ్చి, మంగళవారం నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఒకవేళ మంగళవారం లోపల ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే, బుధవారం రోజున రైతులకు గిట్టబాట్ట ధర కల్పించేంతవరకు దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వడ్డే విరేష్, అజయ్, ఆర్కే నాయుడు, నాగరాజ్, రంగస్వామి, ఎర్రి స్వామి, విజయ్ కుమార్, నాగరాజ్, అభిరామ్, రమేష్, ఇస్మాయిల్ తిమ్మ, బిజెపి మండల నాయకులు, శంకరయ్య, మరియు సిసి రంగన్న, రామాంజనేయులు, గోరంట్ల, నరేష్, చంద్ర, సోమన్న, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com