కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో కరకట్టక్రింద మామిడితోటలు ప్రక్కన నిరుపేదలకు సుమారు 800 ఇల్లాస్థలాలు ప్లాట్లు ఇచ్చినారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సందర్బలలో నిరుపేదలుకు ఇచ్చిన ఇళ్లస్థలంలో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తాం , కేవలం లబ్ది దారులు మామిడి తోరణాలు కట్టుకొని గృహప్రవేశం చేయవచ్చు అనీ చెప్పినారు. ముఖ్యంగా అవనిగడ్డలో కరకట్టక్రింద ఇచ్చిన ఇంటి స్థలాలు విషయంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతారు, వరదలు వస్తే ఇల్లు మునుగుతాయి ఇది సరి అయిన ప్రదేశం కాదు వేరొక చోట ఇవ్వండి అనీ ప్రతిపక్షాలు ప్రభుత్వంకు మోర పెట్టుకున్న అక్కడే స్థలాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హోసింగ్ DE భానుజీరావు గారు నిన్న ఇళ్ల ప్లాట్స్ వద్ద లబ్ది దారులుతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి లబ్ది దారుడు 90 వేలు రూపాయలు మీ దగ్గర అట్టిపెట్టుకొని మూడు సారులుగా అంటే పౌండిషన్ స్థాయిలో 30 వేలు, దర్వజ స్థాయిలో 30వేలు, స్లాబ్ స్థాయిలో 30 వేలు మీరే స్వయంగా ఖర్చు పెట్టుకోవాలి, తరువాత కేంద్ర ప్రభుత్వ నిధులు 1 లక్ష 80 వేలు ఇస్తారు కాబట్టి ప్రతి లబ్ది దారుడు 90 వేలు అత్తిపెట్టుకున్నవారికి ఇల్లు కట్టించి ఇస్తాం అనే మాట చాలా అచ్చర్యంగా ఉంది. గత ప్రభుత్వం కూడా ఇళ్లస్థలం ఇచ్చి 12 వేలు లబ్దిదారుడు చూచు కోవాలి అంటే 12 వేలు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలలో పిచ్చిమొక్కలు పెరిగినాయి. అలాగే లబ్ది దారుడు ముందు ఖర్చు పెట్టినా గత ప్రభుత్వంలో బిల్లు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చెల్లించలేదు. మీ ప్రభుత్వం స్వయంగా ఇల్లు కట్టిస్తాం అనీ మాట ఇచ్చి ఇప్పుడు 90 వేలు చూచుకోండి ఇల్లు కడతాం అనే మాటలు చాలా బాధగా ఉన్నాయి. మాట ఇచ్చి ఈరోజు మాట తప్పటం ధర్మమా? రెక్క అడితేగాని డొక్కాడని నిరుపేదలు చాలా మంది ఉన్నారు, వీళ్ళలో చేంచులు, యానాదులు ఉన్నారు. కాబట్టి 90 వేలు ప్రతి లబ్ది దారుడు భరించాలి అంటే కష్టం. కాబట్టి నియోజకవర్గం ఎంఎల్‌ఏ గారు, అధికారులు ఒకసారి నిరుపేదల భవిష్యత్తు ఆలోచన చెయ్యండి.
1.1లక్ష 80 వేలుతో ముందుగా ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వండి. డబ్బులు ఉన్నవారు వాళ్ళ స్తోమత బట్టి మిగిలింది కట్టించుకుంటారు.
2. వరదలు వచ్చి నప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఇప్పుడు ఉన్న మెరక కన్నా రెండు అడుగులు ఎత్తు పెంచండి. ఎందుకు అంటే ఇది మెట్టపోలం, నది గర్భంలో ఉంది కాబట్టి.
3. నీరుపేదలకు ఇచ్చిన లే అవుట్ చుట్టూ వరద నీరు వచ్చినా ఇబ్బంది లేకుండా చుట్టూ 7 అడుగులు ఎత్తు రక్షణ గోడ కట్టించండి.
4. ఇల్లు కట్టేముందు మట్టి నమూనా పరీక్ష చేయించండి. ఎందుకు అంటే ఇది మెట్ట పొలం కాబట్టి.
ఈ పై విషయాలు అన్నీ పరిశీలించి నిరుపేదలకు న్యాయం చెయ్యాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము అని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు గారు కోరారు.