పాడేరు ( జనస్వరం ) : పాడేరు మండలం నేరేడివలస గ్రామంలో నివాసం ఉంటున్న, పండోయి కోటిబాబు, అనే బాధితుడని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు…అయితే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక, వైజాగ్ కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపించడం జరిగింది.. అయితే అక్కడ రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. అయితే రోగికి కడుపులో కణతలు రావడం జరిగింది.. సిటి స్కానింగ్, ఎంఅర్ఏ స్కానింగ్ ద్వారా వ్యాధి లక్షణాలు తెలుసుకోవలసిన పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, నిర్లక్ష్యం వళ్ళ మెరుగైన వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు విద్య వైద్యం అందించడంలో వైసిపి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును బట్టి ప్రజల్ని మోసం చేయడానికి అరోగ్య సురక్ష పథకం పేరుతో మోసం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో వైద్యం అందించలేని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రజలను అరోగ్య సురక్ష పథకం ద్వారా గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్యం ఎక్కడ అందింది అని తెలిపారు. అలాగే విడుదల రజనీ అరోగ్య శాఖ మంత్రిగా మీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మెరుగైన వైద్యం అందించాలని ఎందుకనీ సరైన సదుపాయాలు కల్పించాలని జగన్ మోహన్ రెడ్డి దగ్గర స్పందించని దాఖలలు లేవని ప్రజలకు న్యాయం చేయాలేని మీ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.. మండల నాయకులు సుమన్ మాట్లాడుతూ, తక్షణమే స్పందించి సరైన వైద్యం అందించలేని మరుక్షణం గిరిజన ప్రజలకు అందుబాటులో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. గంగులయ్య ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని తెలిపారు.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో జనసేన పార్టీ ముందు ఉంటాదని వివరించారు.. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అద్యక్షులు నందోలి. మురళీకృష్ణ, జనసేన పార్టీ కాకినాడ ఐటీ విభాగం సభ్యులు సి. హెచ్.అనిల్ కుమార్, పాడేరు మండల నాయకులు, సుమన్,సుబ్బారావు, జైరాజ్ తదితరులు పాల్గొన్నారు.