Logo
Date of Publish : 28 March 2023, 7:43 am
Editor : Sake Naresh

పెదమరికి పంచాయితిలో నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపించాలని జనసేన నాయకుల డిమాండ్

              పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో ఇటీవల పెద్దయెత్తున నిధులు దుర్వినియోగం జరిగిన మాట అందరికీ విధితమే. అయితే,ఈ నిధులు దుర్వినియోగం విషయం పై, MPDO గారు గ్రామ సచివాలయంలో పంచాయతీ ప్రజల సమక్షంలో విచారణ చేపట్టి, రికార్డులు పరిశీలించగా అవినీతికి పాల్పడినట్లు నిర్థారించారు. తదుపరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు DLDO గారు కూడా ఈ విషయం గూర్చి రెండవసారి ప్రజలందరి సమక్షంలో విచారణ జరిపి, రికార్డులను పరిశీలన చేయగా నిధుల్ని దుర్వినియోగపరిచినట్లు వెల్లడించారు. అందుకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లు కూడా ప్రజలందరి ముందు నేరాన్ని ఒప్పుకున్నారు. ఇందు విషయమై పెదమరికి పంచాయతీ వైస్ సర్పంచ్,వార్డ్ మెంబర్లు,పెద్ధలు,ప్రజలు అనేక పర్యాయాలు ప్రభుత్వ అధికారులు దృష్టికి, ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి, విన్నవించి ఈ నెలతో సరిగ్గా 4వ,నెల పూర్తివౌతుంది. కానీ, సమస్యకు పరిష్కారం లభించకపోవడం శోచనీయం. నెలలు గతిస్తున్న జాప్యం జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇంకా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజలకు ప్రభుత్వ అధికారులపై, చట్టాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయే అవకాశం ఏర్పడుతుందని జనసేన నాయకులు అన్నారు. కావున అధికారులు తక్షణమే స్పందించి అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లతో రికవరీ కట్టించి,వారిని విధులు నుండి తొలగించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా పలుమార్లు విజ్ఞప్తి చెయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున ఆ గ్రామ ప్రజలు జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది ఈ రోజు స్పందన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయుకులు, వీర మహిళలు, జనసైనికులు సమక్షంలో మరల వినతిపత్రం అందజేయడం ఆయితే కలెక్టరు సానుకూలంగా స్పందించి సంభవించిన అధికారి అయిన DlDO గారిని పిలిచి రెండు రోజులో రిపోర్టు సమర్పించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మని, బొనెల గొవింధమ్మ, రాజాన బాలు, ఖాతా విశ్వెశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థన్ రావు పైల రాజు, దుర్గ, జనసైనికులు, వీర మహిళలు,పెద మరికి పంచాయతి ప్రజలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com