Logo
Date of Publish : 20 January 2022, 1:46 pm
Editor : Sake Naresh

మెగా బ్రదర్స్ సేవాసమితి ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన జనసేన నాయకులు

             నెల్లూరు (జనస్వరం ) : గూడూరు పట్టణంలోని  ఓం శ్రీ సాయి రామ్ చారిటీస్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న గోపాల్ అనే వ్యక్తి మృతి చెందడంతో అతనికి సంబంధించిన వారు ఎవరు  లేకపోవడంతో మెగా బ్రదర్స్ సేవాసమితి ఆధ్వర్యంలో మరణించిన గోపాల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తెలిపారు . గోపాల్  మృతి చెందిన సమాచారాన్ని స్థానిక పోలీసు అధికారులకు మెగాబ్రదర్ సేవా సమితి సభ్యులు తెలియజేసి వారి అనుమతితో అంత్యక్రియలు కార్యక్రమం పూర్తి చేశారు.  గత నెల 22వ తేదీన గూడూరు పట్టణంలోని  అల్లూరు ఆదిశేషారెడ్డి  ప్రభుత్వ స్టేడియంలో గోపాల్ అనే వ్యక్తి  ఒంటరిగా ఉండడాన్ని గుర్తించిన మెగా బ్రదర్స్ సేవాసమితి సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో  గోపాల్ ను పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ ఆశ్రమంలో చేర్పించారు.  గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆశ్రమ నిర్వాహకులు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులకు సమాచారం అందించారు. మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు ఆశ్రమానికి చేరుకుని గోపాల్ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. మృతిచెందిన గోపాల్ వివరాలు తెలుసుకునేందుకు మెగా బ్రదర్స్ సేవాసమితి అనేక విధాల  ప్రయత్నించింది మీడియా ద్వారా కూడా ప్రయత్నం చేయగా గోపాల్ కు చెందిన వారు ఎవరు రాకపోవడంతో అనాధగా గుర్తించి మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మరియు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు సూర్య, మోహన్ పాల్గొన్నారు . 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com