నెల్లూరు (జనస్వరం ) : గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయి రామ్ చారిటీస్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న గోపాల్ అనే వ్యక్తి మృతి చెందడంతో అతనికి సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో మెగా బ్రదర్స్ సేవాసమితి ఆధ్వర్యంలో మరణించిన గోపాల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తెలిపారు . గోపాల్ మృతి చెందిన సమాచారాన్ని స్థానిక పోలీసు అధికారులకు మెగాబ్రదర్ సేవా సమితి సభ్యులు తెలియజేసి వారి అనుమతితో అంత్యక్రియలు కార్యక్రమం పూర్తి చేశారు. గత నెల 22వ తేదీన గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గోపాల్ అనే వ్యక్తి ఒంటరిగా ఉండడాన్ని గుర్తించిన మెగా బ్రదర్స్ సేవాసమితి సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో గోపాల్ ను పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ ఆశ్రమంలో చేర్పించారు. గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆశ్రమ నిర్వాహకులు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులకు సమాచారం అందించారు. మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు ఆశ్రమానికి చేరుకుని గోపాల్ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. మృతిచెందిన గోపాల్ వివరాలు తెలుసుకునేందుకు మెగా బ్రదర్స్ సేవాసమితి అనేక విధాల ప్రయత్నించింది మీడియా ద్వారా కూడా ప్రయత్నం చేయగా గోపాల్ కు చెందిన వారు ఎవరు రాకపోవడంతో అనాధగా గుర్తించి మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మరియు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు సూర్య, మోహన్ పాల్గొన్నారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com