రాజంపేట, (జనస్వరం) : రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రిజిస్టర్ పోస్టు ద్వారా కలెక్టర్ గారికి అభ్యంతరాలను తెలపాలని జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ తరఫున 200 పైగా జనసేన నాయకులు, కార్యకర్తలు, రాజంపేట పుర ప్రజలు కలెక్టర్ గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా మహాశివరాత్రి సందర్భంగా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా అన్ని అర్హతలు ఉండి, అన్ని సదుపాయాలు మంచి నీటి వసతులు ఉన్నాయని రాష్ట్ర జిల్లాల ఏర్పాటు చట్టం 1974 ప్రకారం పరిపాలన సౌలభ్యం మరియు అభివృద్ధికి అన్ని విధాల అనువైన ప్రాంతం అని అన్నారు. బ్రిటిష్ పరిపాలన నుండి రెవెన్యూ కేంద్రంగా ఉన్న, శ్రీనివాసునికి వేలాది కీర్తనలు రాసిన అన్నమయ్య జన్మస్థలంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజంపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వరకు అధికార పార్టీ నాయకులు వారి పదవులకు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల దృష్టిలో రాజంపేట ద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే 1200 డిజిటల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశామని, జేఏసీ తరఫున రాజంపేట గ్రామాల నుండి ఐదు వేల పైగా పోస్ట్ కార్డుల ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించామని అన్ని పంచాయతీల్లో సర్పంచ్ నుంచి కుల సంఘాల, విద్యార్థి సంఘాల, ఉద్యోగ సంఘాల, అన్ని పార్టీల నాయకుల నుండి వినతి పత్రాలను కలెక్టర్ గారికి నేరుగా ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ పోస్టు ద్వారా రాజంపేట నుండి అత్యధిక స్థాయిలో ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది. జిల్లాల విభజన ప్రక్రియ మొదలై 30 రోజులైనా ప్రజలలో రాజంపేటకు అన్యాయం జరుగుతుందని ఆవేదనను ప్రభుత్వానికి వివిధ రకాల నిరసనల రూపంలో ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే జనసేన పార్టీ తరఫునుండి న్యాయపోరాటము చేస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకుడు బాలసాయికృష్ణ మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com