పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం కటరకొండ, పులిచర్ల గ్రామాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యటన జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు CG రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్ గ్రామాలకి వెళ్లాలంటేనే మోకాలు లోతు గుంతల పడిన రోడ్డులో వెళ్లాల్సి వస్తుంది అంటే ఈ గ్రామాలకు వెళ్లే ఈ ప్రజల పరిస్థితి ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ఈ గ్రామాలకు అనేకసార్లు పూజ కార్యక్రమాలు జరిగినప్పటికీ సిసి రోడ్డు లేదా తారు రోడ్డు వేయలేకపోయారు. ఈ రోడ్ లోనే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఈ రోడ్డు వెంట నడిచే ప్రతి ఒకరికి నరక యాత్ర కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ప్రతిరోజు ఈ గుంతల్లో నడుచుకుంటూ వెళ్లే వారికైనా బైక్ లో ప్రయాణించేవారు. బైక్ స్కిడ్ అయ్యి ప్రతిరోజు 10 మందికి పైగా కింద పడి దెబ్బలు తగులుతున్నాయి అంటేనే మనం అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటికీ ఈ గ్రామాలలో ఉన్న రోడ్డు నిర్మాణ సమస్యను, ప్రస్తుత ప్రభుత్వం, గానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు గాని, ఎందుకు రోడ్డు వేయలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి స్వార్థం కోసం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పటికైనా గానీ కటార కొండ పులిచెర్ల గ్రామాలకి రోడ్డు వేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేనియెడల తమ స్వార్థ రాజకీయాలు కోసం జనాలను కీలుబొమ్మలుగా చేసి ఆట ఆడుతున్న మీ ఆటలు ఇక సాగవు. జనాల్లో మార్పు మొదలైంది. ఆ మార్పు ఏంటో 2024లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా కాని అధికారపక్షం అయినా ప్రతిపక్షం పార్టీ నాయకులు అందరికీ మీ స్వార్థ రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల కోసం పని చేయండి గ్రామాల అభివృద్ధికి చేయండి సహకరించండి, కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండేవిధంగా మార్పు తీసుకువద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, నాగేశ్వరరావు, కాలువ భాస్కర్, తిరుపాల్, లవన్న, గంగాధర్, మరియు తదితరులు పాల్గొన్నారు.