పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం జనసేన ప్రజా పోరాట యాత్ర ద్వారా అనేక గ్రామాల్లో పర్యటించారు గ్రామాలలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ఎంపీడీవో గారికి క్లుప్తంగా ఆయా గ్రామాలలో నెలకొన్న ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్యను ఎంపీడీవో గారికి తెలియజేశారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లో ప్రజా పోరాట యాత్ర ద్వారా వెల్దుర్తి మండలంలోని, బుక్కాపురం, రామకృష్ణాపురం, కలగొట్ల, పుల్లగుమ్మి, లింగాలపల్లి, రామళ్లకోట, సిద్ధన గట్టు, నరసాపురం, బోయినపల్లి, రామాపురం, గ్రామాలలో జనసేన ప్రజా పోరాట యాత్ర, ద్వారా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఆయా గ్రామాలలో ప్రజలతో మాట్లాడి అనేక సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఒక్కో గ్రామంలో ఒక సమస్య ఉంది అన్నారు. గ్రామాలలో ప్రధాన సమస్యలు, త్రాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, సరైన సిసి రోడ్లు, లేక మరియు, పింఛన్లు రాక, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, మరికొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ వర్కర్ల సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. అలాగే స్కూళ్లలో సరైన వాటర్ సౌకర్యం లేని దృశ్యాలు చూసాం ఇలా ఒక్కొక్క గ్రామంలో ఒక సమస్య ఉందని, అలాగే వెల్దుర్తి మండల నాయకులు బాబ్జి, సోమరాజు, మధు కుమార్, ఆధ్వర్యంలో ప్రతి సమస్యపై వివరించడం జరిగింది. అన్ని సమస్యలు విన్న ఎంపీడీవో శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, మీరు చెప్పిన ఈ సమస్యలపై వెంటనే పరిష్కరించే విధంగా మేము చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు చిన్నరాజు, సుధీరు, మనోజు, గిరి, అయ్యా స్వామి, చిరంజీవి, ఆలంకొండ నాగేశ్వరరావు, తిరుపాల్, రాకేష్, ఆగవెల్లి పులి శేఖర్, మదన గోపాల్, విజయ్, వీరేష్, సూదేపల్లె చిన్న ,రత్నపల్లి శేఖర్, మరియు తదితరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com