Search
Close this search box.
Search
Close this search box.

గిరిజన చట్టాలకు, హక్కుల కోసం కలసికట్టుగా పోరాడుదామని జనసేన నాయకుల పిలుపు

జనసేన

        పాడేరు ( జనస్వరం ) : దారకొండ పంచాయితీ చెందిన మారుమూల గ్రామమైన చిలకవీధి గ్రామస్తుల పిలుపుమేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన జనసేనపార్టీ నాయకులు  హాజరయ్యారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ ఈ గ్రామంలో పరిస్థితులు సోషల్ మీడియాలో చూశామని అందుకే సందర్శించాలని వచ్చామని అన్నారు. గ్రామస్తులు గంగులయ్య గారితో మా గ్రామానికి సందర్శించిన ప్రస్తుత ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడప, గడప తిరుగుతూ మీకు అండగా ఉంటామన్నారు. కానీ నేటికీ పాఠశాల భవనం అసంపూర్తి నిర్మాణంగానే ఉందని, గ్రామంలో అంగన్ వాడి భవనం లేదని, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించలేదని వాపోయారు. గంగులయ్య వారితో మాట్లాడుతూ ఒకసారి నమ్మి వైసీపీ కి అధికారమిచ్చి మనమంతా మోసపోయామని అంతే కాకుండా మనకు రక్షణగా ఉండాల్సిన చట్టాలు, హక్కులు కూడా కోల్పోయామన్నారు అధికాకుండా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కేవలం వారి అసమర్థత కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేరే కులాలను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చి మన బ్రతుకులు నాశనం చెయ్యాలని చూస్తోందన్నారు. ఇటువంటి విపత్కర సమయాల్లో గిరిజనులుగా మనమంతా మేల్కోవాలన్నారు. మేము ఓట్లకోసమో మిమ్మల్ని మభ్యపెట్టడానికి రాలేదని వాస్తవ రాజకీయాలు పార్టీల మోసాలను మీకు వివరించి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికొచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే మాత్రం ముందుగా మా ప్రాధాన్యత గిరిజన రక్షణ కొరకు మన హక్కులు, చట్టాలు కాపాడుకోవడానికి మా మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

            ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గం లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులకు చట్టాలకు రక్షణ కల్పించాలంటే కేవలం జనసేనతోనీ మాత్రమే సాధ్యమని అందుకు గిరిజన యువత అంతా చైతన్య వంతులు కావాలని, రానున్న భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే మన హక్కులు కాపాడుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం జనసేన పార్టీయేనని చెప్పారు. అదేవిధంగా గిరిజన యువత యువకులు నిరుద్యోగుల యువకులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వైసిపి నాయకులు చేస్తున్నటువంటి మోసాలు దగాలు అలాగే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ల సంపాదన పెంపుకోసమే రాజకీయ పదవులు అలంకరించారు తప్పితే గిరిజన ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంలో వారు లేరని స్పష్టం చేశారు. అలాగే రానున్న భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో గిరిజనుల తరపున జనసేన పార్టీ ఒక నిర్మనాత్మకమైన ఆలోచన చేస్తుందని గిరిజన చట్టాలకు, హక్కులకు అలాగే అపరిసృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద గ్రామమౌలిక సదుపాయాల కల్పనల వంటి సమస్యల మీద మా వంతు ప్రయత్నం గా మేము వాటికై మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరియు మండల అధ్యక్షులు జికే వీధి మండలం కొయ్యం బాలరాజు, జి మడుగుల మం. అధ్యక్షులు మాసడి భీమన్న చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు. మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో జనసేన పార్టీ నుంచి చేసి చూపిస్తామన్నారు. వైసిపి పార్టీని నమ్మిచాలా మోసపోయాం ఈసారి అటువంటి తప్పిదం మీరు చేయకూడదని నీతి నిజాయితీగా ఉన్నటువంటి జనసేన పార్టీని మీరందరు జనసేన పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ సమావేశంలో అమ్మవారి దారకొండ పంచాయితీ చిలకల వీధి గ్రామస్తులు వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీని నమ్మి కండువా కప్పుకొని జనసేన పార్టీలో చేరారు. ఈ సమావేశంలో జీకే వీధి మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, జీకే వీధి మండల యూత్ అధ్యక్షులు కొయ్యం సిద్దు, పొత్తురు విష్ణుమూర్తి, వనపల ఈశ్వర్, బూత్ కన్వీనర్ రఘువంశి, గడుతూరి పరమేశ్వరరావు, మాత్యరాజు, జి మాడుగుల మం అధ్యక్షులు మసడి భీమన్న, ఐటి ఇంచార్జ్ అశోక్ కుమార్, సంతోష్, వంతల శేఖర్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుచ్చిబాబు, బూతు కన్వీనర్ స్వామి జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way