రాజంపేట ( జనస్వరం ) : సిద్ధవటం మండలం సిద్ధవటం తాసిల్దార్ కార్యాలయంలో జగనన్నకు చెపుతాము కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు గారు బిల్ కలెక్టర్ పాల్గొనడం జరిగింది. సిద్ధవటం మండలంల సిద్ధవటంలో పలు సమస్యల మీద ప్రజలకు మద్దతుగా జనసేన పార్టీ ద్వారా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. బొగ్గు రెడ్డి వారి పంచాయితీలో దుర్గమ్మ కాలనీలో గత ప్రభుత్వంలో బోర్ వేశారు మోటారు పైపులైను అధికారులు వెయ్యలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఆ సమస్య అలాగే ఉందని జనసేన నాయకులు వాపోయారు. ఎన్నో దఫాలుగా స్పందనలో ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో, వీధిలైట్లు కూడా వెలగడం లేదని, ఎవరో రైతు పొలంలో నీళ్లు ఇస్తుంటే అవి వాడుకుంటూ జీవనం సాగిస్తున్నామని కలెక్టర్ కు ఫిర్యాదు విన్నవించుకోవడం చేయడం జరిగింది. కలెక్టర్ గారు సావధానముగా వినడం జరిగింది. ఎస్సీ గారిని సెక్యూరిటీ గారిని పిలిచి కనీసం వాటర్ నీళ్లు వసతి కూడా ఇవ్వకుంటే ఏంటని సీరియస్ అవ్వడం జరిగింది. ఎస్టి ఎస్సీ నిధులు ఉన్న ఏంటని సీరియస్ అవ్వడం జరిగింది. దాదాపు పది నిమిషాలు మాట్లాడడం జరిగింది. వెంటనే సమస్య పరిష్కరించాలని తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది.
సిద్ధవటం రోడ్లు వెడల్పు గురించి కూడా 2003 నుంచి 2023 వరకు రోడ్లు వెడల్పు నోచుకోలేదని, సిద్ధవటం ఆమడ దూరంలో అభివృద్ధి ఉందని 2020లో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తామని ఆర్ అండ్ డబ్ల్యు ఎమ్మార్వో వాళ్ళు ఉన్నపలంగా ఇళ్లలో కూర్చొని చేశారని అన్నారు. కంకర వేసి గుంతలు తవ్వి వదిలేసారని సిద్ధవటంలో ఎక్కడ చూసినా మొండి కూడా కనిపిస్తున్నా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే కరెంట్ ఫోల్లకు స్విచ్ ఆన్ ఆఫ్ లేవని రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టే రాజేష్, జనసేన పార్టీ వార్డు మెంబర్ పసుపులేటి కళ్యాణ్, బొగ్గు రెడ్డి వారి పంచాయతీ ప్రజలు, యాసగిరి నరసింహులు, లక్ష్మీదేవి, సిద్ధవటం ప్రజలు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com