Logo
Date of Publish : 10 July 2021, 3:33 pm
Editor : Sake Naresh

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారును అడ్డుకున్న జనసేన నాయకులు

         ప్రయాణానికి ప్రతిబంధకంగా మారి' ప్రమాదాలకు కారణమవుతున్న రహదారుల దుస్థితిని పట్టించుకోకపోవడంపై మండల జనసేన కార్యకర్తలు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలకు హాజరవుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారును జనసేన నాయకులు ముక్తేశ్వరం కూడలిలో  అడ్డగించారు. ముక్షేశ్వరంలో రహదారులు లోయలను తలపిస్తున్నాయని ప్రయాణానికి అడ్డంకిగా మారినా వైసీపీ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై తక్షణం దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా వర్షం వస్తుంటే నీటితో నిండి వాహనాలు మునిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని త్వరలోనే రోడ్లకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కె.ఆర్‌. విజయకు జనసేన నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్దా చంటిబాబు, పడాల గిరి, పోలిశెట్టి రాజేష్‌, మాసాబత్తుల శ్రీను, విళ్ళ చలపతిరావు, లక్ష్మణ్‌, కుప్పాల రాంబాబు, తోలేటి ఉమా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com