కర్నూలు జిల్లా ఆత్మకూరులో ముంపు గ్రామాలలో 300 మందికి భోజన ఏర్పాట్లు చేసిన జనసేన నాయకులు
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో వర్షం కారణంగా కొన్ని గ్రామలకు వర్షపు నీరు చేరి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ముందుకు వచ్చిన శ్రీ శైలం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరాములు సూచనల మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ శ్రీశైలం నియోజకవర్గం జనసైనికులు ఆధ్వర్యంలో 300 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, అక్కడ ప్రజలు వారికి కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోయిందని, గత వారం రోజులుగా అంధకారం లో ఉన్నామని, కనీసం పసిపిల్లలకు పాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వాపోయారని ఆ వరద బాధిత కుటుంబాలు అన్నాయి. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి, వారికి తగిన న్యాయం చెయ్యాలని, పంట నష్ట పోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో హరీష్ఇం, తియాజ్ ఖాన్, మహెబూబ్. హుసేన్, షేర్ ఖాన్, బాసిధ్, ఇమ్రాన్, లడ్డు. ఖాదర్ వలీ తదితరులు పాల్గొనడం జరిగింది.