Logo
Date of Publish : 13 October 2022, 2:12 pm
Editor : Sake Naresh

నరవరెల్లి కాలనీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు నిరసన

     పెందుర్తి, (జనస్వరం) : నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం రెల్లి కాలనీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు వీధిలైట్లు లేకపోవడం, డ్రైనేజీ క్లీనింగ్ చేయకపోవడం వలన సుమారు 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని సచివాలయం సిబ్బందికి వినత పత్రం ఇవ్వడంతో పాటు కాలనీ ప్రజలతో జనసేనపార్టీ నాయకులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం రెల్లి కులస్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యమని, అధికారులు సమాధానం చెబుతూ మా కింద వర్కర్స్ లేరు క్లీన్ చేయడానికి, వీధిలైట్లు వేద్దామంటే నిధులు లేవు అని సమాధానం చెబుతున్నారని, అధికారులు ఇలా మాట్లాడితే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని మాట్లాడారు. స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కాలనీలో సుమారు 50 కుటుంబాలు కొన్ని దశాబ్దాల కాలం నుండి నివసిస్తున్నారని, కనీసం వీధిలైట్లు ఏర్పాటు, మురికి నీటిని క్లీన్ చేయలేని ఈ ప్రభుత్వాలు ఎందుకని, కాలనీ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి సచివాలయ అధికారులకు సమస్య కోసం మొరపెట్టుకున్న ప్రజలకు కాళ్లు చెప్పులు అరిగాయి గాని సమస్యకు పరిష్కారం మాత్రం చూపడం లేదని, ఈ రెల్లి కాలనీ ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, కార్పొరేటర్ మొల్లి ముత్యాలునాయుడు వీధిలైట్లు ఏర్పాటు చేయలేని వారికి మీకు పదవులు ఎందుకని మీరు మీ పదవులకు రాజీనామా చేసి ప్రజల వైపు నిలబడాలని జనసేనపార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని, మీడియా ప్రతినిధులు కూడా ఈ యొక్క రెల్లి కాలనీ సమస్యను ప్రభుత్వ దిష్టికి తీసుకొని వెళ్లి వారి సమస్య పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ  కార్యక్రమంలో రాడీ పెంటారావు, శ్రీను, కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com