ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టని అధికారులపై జనసేన నాయకుల ఆగ్రహం
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం కాదరాబాదరా గ్రామం మధ్యలో బండ్లవాగు కాల్వ దాటుతూ కదరాబాదరా గ్రామానికి చెందిన బండారు నడిపి చెన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. జరిగి మూడు రోజులు జరిగిన కలెక్టర్ గారు పోలీసులు గాని సంబంధిత అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇంతరవరకు గాలింపు చర్యలుచేపట్టకపోవడం బాధాకరం ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆళ్ళగడ్డ జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల మండల నాయకులూ బావికడి గుర్రప్ప పసుల నరేంద్ర యాదవ్ కలసి ఓదార్చడం జరిగింది. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ వెంటనే గాలింపు చర్యలు వేగవంతం చేసి కుటుంబానికి ఎక్స్ గ్రాసియా ప్రకటించి బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయపాల్ రమేష్, వంశి, కర్ణ, సుభాష్, శివ, రామచంద్రుడు మరియు బి యస్ పి, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.