Logo
Date of Publish : 07 November 2021, 7:04 am
Editor : Sake Naresh

గుంతకల్ లో దళిత నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు

          గుంతకల్ ( జనస్వరం ) : కాల గర్భంలో కలిసి పోయినా దళిత మాణిక్యం, మహనీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారిని పైకి తీసి ఆయన గొప్పతనాన్ని సమాజానికి మరోసారి చాటి చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. శ్రీ దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే కాక ఆయన పేరును ఆయన పుట్టిన కర్నూలు జిల్లాకు పెట్టాలని తద్వారా దామోదర సంజీవయ్య జిల్లాగా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని హర్షిస్తూ రాష్ట్రంలోని దళితుల౦దరి ఆత్మగౌరవం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి యావత్ దళిత జాతి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ గుంతకల్ జనసేన పార్టీ బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ప్రముఖ దళిత నాయకులు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది.

                ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎంతో నీతి, నిజాయితీతో జీవించారు ఆయన ముఖ్యమంత్రి అయినా తరువాత వారి మాతృశ్రీ కి ఖర్చులు కు గాను 100 రూపాయలు ఇస్తే, ఆ పుణ్యస్త్రీ ఊర్లో, రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ ఎవరు 100 రూపాయలు ఇస్తారు అని చెబితే ఆ క్షణంలో మెదిలిన ఆలోచనే వృద్ధాప్య పెన్షన్ పథకం, ఆయన రెండు సంవత్సరాల పరిపాలనా కాలంలో 6 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని బడుగు బలహీన వర్గాల వారికి పంపిణీ చేసిన దార్శనికుడు మరియు వంశధార, వరదరాజుల, గాజులదిన్నె, పులిచింతల ప్రాజెక్టుల సృష్టికర్త. ప్రతి జిల్లాలోనూ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసిన ప్రథముడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు వారి స్ఫూర్తితో భవిష్యత్తు ప్రజా ప్రభుత్వంలో పేదలను పరిపాలకులుగా చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి సంకల్పం నెరవేరాలని ప్రజలందరూ ఇటువంటి నాయకుడిని బలపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ పామయ్య, రమేష్ రాజ్, రామకృష్ణ, మంజు జనసైనికులు,నాయకులు పురుషోత్తం, పాండు కుమార్, సుబ్బయ్య, ఎస్ కృష్ణ, హేన్రిపాల్, గాజుల రాఘవేంద్ర, శ్రీనివాసులు మరియు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com