Logo
Date of Publish : 06 July 2021, 3:47 pm
Editor : Sake Naresh

బాబు జగ్జీవన్ రామ్ గారి 35 వ వర్ధంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన నాయకులు అక్కల మోహన గాంధీ

         భారత దేశం ఉప ప్రధాని స్వతంత్ర సమర యోధుడు సమాజ నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ గారి 35 వ వర్ధంతిని కొండపల్లి బీ కాలనీ సెంటర్లో  వున్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ గారు మాట్లాడుతూ, గాంధీజీ చేత అమూల్య భారత రత్నగా పిలువబడే బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య, సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషిచేశారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కరణోద్యమనేత బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనా పార్టీ నేతలు బొలియా శెట్టి శ్రీకాంత్, యర్రం శెట్టి నాని, అశోక్ బాబీ, వంశీ ప్రవీణ్, పార్థు, సురేష్, రామంజి, చరణ్ ప్రవీణ్, కార్యకర్తలు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com