
వెదురుకుప్పం, (జనస్వరం) : వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ఈస్ట్ గ్రామంలో భర్తను పొగొట్టుకున్న నిరుపేద మహిళలు మీనా, చంద్ర కళలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గం జనసేన నాయకులు యుగంధర్ పొన్న గారు తెలియజేసారు. నిరుపేదలకు జనసేన పార్టీ అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే వారి పిల్లల చదువు విషయంలో, వారు ఉన్నత స్థాయికి వెళ్లేంత వరకు చేదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మేలు చేయడంలో జనసేన పార్టీ ముందుంటుందని తెలిపారు. చిన్న వయసులోనే భర్తను పొగొట్టుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున కుటుంబానికి పదివేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలిపారు. కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు లోకనాధం నాయుడు, సమన్వయ కర్తలు కోనేరు బాలాజీ రెడ్డి, రాఘవ, మండల అధ్యక్షులు పురుషోత్తం, నాయకులు మహేష్, సాయి కుమార్ గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.