కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామంలో ఆక్రమణలు, తొలగింపు పేరుతో పట్టాదారుల ఇళ్ళు ప్రైవేట్ వ్యక్తులు గ్రామ పెద్దలు తొలగించడం అమానుష చర్య. జనసేనపార్టీ నాయకులు CA బీ వీ రావు గారు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నాయకులు కొల్లి బాబీ గారి సమాచారంతో పర్యవేక్షించడం జరిగింది. గ్రామంలో కొల్లి రాంబాబు గారి స్వార్జిత ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం బాత్రూంని ధ్వంసం చేసారు. ఇంటిని ద్వంసం చేస్తాం అని బెదిరించారు. వారు ఆ ఇంటి మీద బ్యాంకు రుణం తీసుకున్నారు. లీగల్ గా క్లియర్ గా ఉన్నది. ఎటువంటి ప్రభుత్వ నోటీసులు లేకుండా ప్రభుత్వంతో సంబంధం లేకుండా గ్రామ పెద్దల పేరుతో విధ్వంసం సృష్టిస్తుంటే శాసన సభ్యులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాగం పట్టించుకోకపోవడాన్ని జనసేనపార్టీ తరపున ఖండిస్తున్నాం అని అన్నారు. 5 రోజుల గా జేసీబీతో ధ్వంసం చేస్తోంటే పోలీస్ వారు ఈ రోజు ఘటనా స్థలాన్ని చేరుకొన్నారు. తమ ఇళ్ళు కోల్పోయిన, కోల్పోతాం అనుకునే బాధితులు భయబ్రాంతులకు గురి అయిన బాధితులు ఆత్మ హత్యయత్నం చేయడం బాధాకరం. జనసేనపార్టీ నాయకులు కొల్లి బాబీ గారు కూడా ఆత్మహత్య యత్నం చేయడం విస్మయానికి గురి చేసినది. ఆయన త్వరగా కోలుకోవాలని అని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల తొలిగింపులు నిలుపుదల చేయించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేసున్నాం అని బీ వీ రావు గారు తెలియచేసారు.