Logo
Date of Publish : 30 July 2020, 6:17 am
Editor : Sake Naresh

లాక్ డౌన్ లో ఆగిపోయిన రష్యన్ యువతికి సహాయం చేసిన జనసేన నాయకుడు

లాక్ డౌన్ లో ఆగిపోయిన రష్యన్ యువతికి సహాయం చేసిన జనసేన నాయకుడు.

           ప్రపంచ మానవాళికి కరోనా వైరస్ ఒక మహామ్మరిలా పట్టి పీడిస్తోంది. ఈ కరోనా వల్ల సామాన్య ప్రజల నుండి ధనవంతుడి వరకూ అందరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా క్షీణించారు. అయితే చాలా మంది ఈ లాక్ డౌన్ వల్ల స్వంత ప్రదేశాలకు వెళ్లకుండా ఆగిపోయిన నిరాశ్రయులెందరో... లాక్ డౌన్ ముందు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రష్యన్ నుంచి ఒక యువతి తిరుపతికి వచ్చింది. ఆమె ఇక్కడకు వచ్చిన  తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఇక్కడే ఉండిపోయింది. అయితే తన వద్ద ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో తన స్వదేశానికి వెళ్లడానికి డబ్బులు లేక, ప్రస్తుతం తన జీవన స్థితి గడవట్లేదని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న స్వదేశానికి తిరిగి వెళ్లలేక,నిలిచిపోయిన రష్యా మహిళకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన జనసేన పార్టీ నాయకులు మాసి కృష్ణ మూర్తి గారు, ఆ మహిళకు తమ స్వగృహంలో ఆతిధ్యం ఇచ్చి మరియు రష్యన్ మహిళ అమ్మ గారిని బృందావన్ నుంచి టాక్సీ ద్వారా ఢిల్లీకి తీసుకొచ్చి, అక్కడ నుంచి ప్లైట్ ద్వారా తిరుపతికి తీసుకువచ్చే బాధ్యత తీసుకుని వారివురుకి వసతి ఏర్పాట్లు చేసిన  జనసేన పార్టీ రాయలసీమ దక్షిణ కోస్తా సంయుక్త సమన్వయ పార్లమెంటరీ సభ్యులు మాసి కృష్ణ మూర్తి గారు.  ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి జనసేన పార్టీ నాయకులు ఉంటారని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తామని చెప్పారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com