
పెందుర్తి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో అనధికారికంగా క్వారీ తవ్వకాలు జరుపుతున్నారని విశాఖపట్నం గనుల అడిషనల్ డైరెక్టర్ శ్రీ D E V S N రాజు గారు దృష్టికి స్థానిక జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారు తీసుకు వెళ్లడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నరవ గ్రామంలో మైనింగ్ కి అనుమతి ఇవ్వడం వలన అక్కడ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కన్నా ఎక్కువ అవ్వడం వలన పెద్ద చెరువు లాగా గుంతలు ఏర్పడ్డాయి అని, వర్షాకాలంలో కొండ నుంచి కిందకి రైతులు పంటలు పండిస్తున్న పొలాల్లోకి రాకుండా గుంతల్లో నీరు నిల్వ ఏర్పడం వల్ల రైతులు వ్యవసాయం చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలా చెరువుల్లో నీరు ఏర్పడడం వలన ఆ యొక్క ప్రాంతంలో మేత కి వెళ్ళిన పశువులు మృత్యువుకు బలి అవుతున్నాయని, ఆకతాయి యువత కూడా ఆ ప్రదేశంలో ఎక్కువగా సంచరించడం వల్ల ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, ఇప్పుడు నరవ గ్రామంలో ఎటువంటి తవ్వకాలకు అనుమతులు లేవని కానీ వ్యాపారస్తులు స్థానిక అధికారులను, ప్రభుత్వ ప్రతి నిధులను లోబర్చుకొని ప్రజల్లో మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన పాత క్వారీ గుంతల ప్రదేశాల్లోనే మట్టిని తవ్వి 3500/- నుండి 5000/- వరకు ఒక లారీ మట్టిని ప్రజలకు అమ్ముతున్నారని, కావున మీరు తక్షణమే స్పందించి ఆ ప్రదేశంలో ఎటువంటి తవ్వకాలు జరపకుండా చూడాలని, గత 20 సంవత్సరాల నుండి నరవ గ్రామంలో ఏ సర్వేనెంబర్ లో ఎన్ని హెక్టర్స్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనే వివరాలు RTI act ద్వారా మిమ్మల్ని అడుగుతున్నానని మాకు వీలైనంత త్వరగా ఆ వివరాలను అందజేయాలని కోరడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ గారు వివరణస్తు మాకు పరిమిత స్టాఫ్ ఉండడంవలన అక్రమ తవ్వకాల జరుపుతున్న వారిని పట్టుకోలేకపోతున్నామని, ప్రభుత్వం వారు ఎటువంటి క్వారీ పర్మిషన్ ఇవ్వలేకపోవడం వలన ప్రజలకి మట్టి అవసరం ఎక్కువగా ఉండడం వలన వ్యాపారస్తులు అక్రమంగా ఇలా తవ్వకాలు జరుపుతు ఎక్కువ రేట్లకు మట్టి అమ్ముతున్నారని, కావున ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఇటువంటి అక్రమ దారులను పట్టుకోవచ్చని, 30 రోజుల్లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ను మీకు అందుబాటులో ఇస్తామని చెప్పడం జరిగింది.