
పలాస, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పలాస నియోజకవర్గం మందస మండలం అంబుగాం పంచాయితీలో జనసైనికులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీకాకుళం జిల్లా BJP ప్రధాన కార్యదర్శి కొర్ల కన్నారావు గారు మరియు జిల్లుండ పంచాయతీ జనసేన MPTC అభ్యర్థి కుప్పాయి గోపాల్ గారు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందస మండలం జనసేన సోల్జర్స్ (MMJS), మందస మండలం జనసైనికులు మరియు అంబుగాం పంచాయితీ జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.