ముంపు గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపు గ్రామాలైన లంకాఫ్ ఠానేలంక, సలాది వారి పాలెం, పుగాకు లంక గ్రామాలను ఈరోజు జనసేన రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనువాస్ లు పర్యటించి లంక గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేస్తానన్న రెండు వేల రూపాయలు తక్షణమే చెల్లించాలని లంక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు పశుగ్రాసం అందించాలని ప్రభుత్వ అధికారులు కోరారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లస్థలాలు ముఖ్యంగా లంక గ్రామాల్లో కేటాయించిన స్థలాలు చెరువును తలపించే విధంగా ఉన్నాయని వాటిని మార్చి మరొక ప్రదేశంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుద్ధటి జమ్మి, గోదాశి పుండరీష్, దూడల స్వామి దామిశెట్టి రాజా జక్కంశెట్టి పండు, బండారు వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com