శ్రీకాకుళం ( జనస్వరం ) : జిల్లాలోని ఎచ్చెర్ల IIIT ఐటీ కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు 200 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులను స్థానిక రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక జనసేన జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావు హాస్పిటల్ కి చేరుకొని అనారోగ్యం పాలైన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం సంఘటన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులను విద్యార్థులకు నాణ్యమైన చికిత్సను అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com