పొందూరు, (జనస్వరం) : పొందూరు మండలం, లక్ష్మిం పేట క్రియాశీలక జనసేన కార్యకర్త కోరాడ అప్పన్న అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుటుంబానికి అన్నివేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రామ్మోహన్ తో పాటు మండల అధ్యక్షులు ఎలకల రమణ, జనసేన నాయకులు కొంచాడ సూర్య,RTI రాజేష్, పొట్నూరు ప్రసాద్, కోరాడ రాజు, పొన్నాడ బాలకృష్ణ, మొదలవలస యశ్వంత్, పల్ల పవన్ కుమార్, కొండ్రు ప్రసాద్ మరియు స్థానికులు ఉన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com