
షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆముదాలవలస జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ గారు డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ తనను ఎన్నుకుంటే, పదవి చేపట్టిన రెండేళ్ల లో మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని మరలా తెరిపిస్తానని, అలా చేయలేని యెడల గడువు అనంతరం తన పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకి దూరమవుతానని వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో అటు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయంపై స్పందించిన నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, మాట తప్పిన కారణంగా ఆయన చెప్పినట్లు తక్షణమే రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here