సోంపేట, (జనస్వరం) రోడ్డుప్రమాదంలో కొద్ది రోజుల క్రితం మృతి చెందినజనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త నీలాపు శ్రీను కుటుంబానికి జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పంపిన ఆరు లక్షల రూపాయలు చెక్కును జనసేన పొలిటికల్ అపైర్సు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అందజేశారు. సాయంలోనూ, సేవలోనూ ఓట్ల రాజ కీయాలు చేసే నేతలను మనం తరుచుగా చూస్తూనే ఉంటాం. ఎదుటి వ్యక్తి తన అవసరాలకు పనికొస్తాడా లేదా అన్న ఆలోచన కూడా లేని పవన్ కళ్యాణ్ లో ‘సేవాభావం మానవతా దృక్సథం, మరే ఇతర రాజకీయ పార్టీ నేతలు లేదన్నది ఈ ప్రాంత ప్రజల మనసులో ఉన్న ఆలోచన, నిండా 18 ఏళ్లు కూడా లేని శ్రీను అనే యువకుడు విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్నితెలుసుకున్న నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు రాష్ట్ర కార్యదర్శి తిప్పన ఈశ్వర రెడ్డి దాసరి శేఖర్, బైపల్లి ఈశ్వరరావులు పవన్ కళ్యాణ్ దృష్టి లో పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కు అందించి ‘ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను మృతుని స్వగ్రామమైన బెల్లుపడకు పంపించారు. ఎంతో కాలంగా ఎన్నో ‘పార్టీలకు తాము ఓటు వేసి ఆదరిస్తూవస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న జిల్లాలో ఉన్న నేతలు ఎవరూ పట్టించుకోక పోయినప్పటికీ ఎక్కడో పవన్ కళ్యాణ్ తన కుమారుడి మరణవార్త విని ఇలా ఆదుకోవడం పవన్ పెద్దమనసుకు ఆమె చేతులు జోడించి నమస్కరించింది ఇటు వంటి మంచి మనసున్న వ్యక్తులు రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.