Logo
Date of Publish : 07 August 2020, 2:44 pm
Editor : Sake Naresh

మరుగుదొడ్లో నివాసం ఉంటున్న వృద్ధురాలికి ఇంటిని నిర్మిస్తున్న జనసేన నాయకులు పాతంశెట్టి సూర్య చంద్ర 

మరుగుదొడ్లో నివాసం ఉంటున్న వృద్ధురాలికి ఇంటిని నిర్మిస్తున్న జనసేన నాయకులు పాతంశెట్టి సూర్య చంద్ర 

     తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని రామయ్య పాలెం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు "జనసేన వన సంరక్షణ" కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మొక్కలు పంచే కార్యక్రమంలో కిర్రి చిలకమ్మ అనే వృద్ధురాలు ఒక మరుగుదొడ్లో నివాసం ఉండటం గమనించారు. ఆ వృద్ధురాలిని వివరాలు ఆరా తీయగా రెండు సంవత్సరాల క్రితం తన ఇల్లు కాలి బూడిద అయ్యిందని, ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఇలా మరుగుదొడ్లో నివాసం ఉంటున్నాని చెప్పింది. అయితే జనసేన నాయకులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2 న నాటికి ఒక ఇల్లు నిర్మిస్తామని ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో వర్షపు నీటికి మొత్తం సామాను అంతా తడిచిపోతోందని, ఈ కరోనా విపత్కర సమయంలో పనులు దొరకక చాల అవస్థతలు పడుతున్నాని ఆవేదన చెందింది. జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ పాతంశెట్టి సూర్యచంద్ర గారు ఆ వృద్ధురాలికి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, పనులను ప్రారంభించడం జరిగింది. సూర్య చంద్ర గారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడవడం మాకు చాలా సంతోషంగా ఉందని, ఇలాగే మానవత్వంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడతాము అని అన్నారు. ఈ కార్యక్రమ౦లో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com