ఈరోజు జనసేన పార్టీ అధ్వర్యంలో " ప్రజా సమస్యల పోరాటనికై జనంలోకి జనసేన" అనే కార్యక్రమాన్ని ఒంగోలు జనసేన పార్టీ కార్యలయంలో సీనియర్ నాయకులు నరహరి సాంబయ్య గారు పార్టీ జండాను ఆవిష్కరించి ప్రారంభించారు. తదుపరి జనసైనికులు అందరూ కలసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 9వ డివిజన్‌లో గల ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ప్రధానంగా మురుగు నీరు నిల్వ సమస్య, కాలువల సమస్య, రోడ్డు లేక వర్షకాలంలో నడవడానికి పడుతున్న ఇబ్బందులు, నిర్ణీత సమయంలో రాని త్రాగునీటి సమస్య మరియు ప్రధానమైన శానిటేషన్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను ప్రభుత్వ అధికారుల మరియు స్థానిక నాయకుల దృష్టికి తీసుకోని వెళ్లినా ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు వాపోయారు. జనసేన పార్టీ తరుపున అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారానికై పోరాడుతామని తెలపటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పిల్లి రాజేష్, బండారుసురేష్, మణి, ఈదుపల్లిగిరి, చెరుకూరిఫణి, నరేంద్ర, భూపతిరమేష్, బ్రహ్మనాయుడు, నాని, సుధాకర్, శంకర్, టంగుటూరి శ్రీనివాస్, అవినాష్, నాగరాజు మరియు వీరమహిళలు ప్రమీల, కోమలి, అరుణ, వాసుకి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com