విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై జనసేన నాయకుడు మురళి దిగ్భ్రాంతి
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై జగ్గయ్యపేట జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకొని, అందులో కరోనా వైరస్ సోకిన పేషంట్లను ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మన జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. అలానే ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బాడిశ మురళి సూచించారు.