ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలాల్లో ఉన్న విద్యార్థుల బస్ షెల్టర్ సమస్యను జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లిన నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గారికి ఉన్న సమస్యను క్లుప్తంగా వివరించి త్వరితగతిన పనులు మొదలుపెట్టి ఆ సమస్యను పరిష్కరించాలని సవినయంగా కోరారు. సమస్యపైన స్పందించిన జాయింట్ కలెక్టర్ వెంటనే దీనిపైన పనులు మొదలు పెట్టి వారం రోజుల్లో మీకు ఒక పరిష్కారాన్ని తీసుకు వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి అయిన దుర్గా ప్రసాద్ గారు, భగత్‌సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ బాబాజీ గారు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com