ఆళ్లగడ్డ ( జనస్వరం ) : అకాల వర్షాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాలలో మొక్కజొన్న, వరి, బొప్పాయి, మామిడి, నిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టాన్ని వ్యవసాయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంచనా వేసి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద యెత్తున ఆందోళనలకు పునుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య ,బావికాడి గుర్రప్ప, కుమ్మరి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com