Logo
Date of Publish : 02 October 2020, 11:40 am
Editor : Sake Naresh

నెల్లూరులో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను నిర్వహించిన జనసేన నాయకుడు మనుక్రాంత్

నెల్లూరులో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను నిర్వహించిన జనసేన నాయకుడు మనుక్రాంత్              

   గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు... నెల్లూరు సిటీ ట్రంక్ రోడ్డు వద్ద గల గాంధీ విగ్రహం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కార్యాలయంలో జాతిపిత పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అప్పట్లో ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే, గాంధీ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అందుకే ఆయన జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరినో తన ఉద్యమస్ఫూర్తిని రగిల్చారు గాంధీ మహాత్ముడి జయంతి సందర్బంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము  అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మనుక్రాంత్ గారితో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, సుజయ్ బాబు, డాక్టర్ అజయ్, అనుదీప్, మోయిన్, సుల్తాన్ భాష, విక్రాంత్, బాలాజీ, తదితర నాయకులు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com