Date of Publish : 14 October 2021, 2:17 pm
Editor : Sake Naresh
తట్టెడు మట్టి ప్రభుత్వం మీద వేశారన్న ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు మాదాసు నరసింహ

కడప ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కొత్తచెరువులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రమదానం కార్యక్రమం చేసిన నిరసన కార్యక్రమం పైన ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. గుంతలు పడ్డ రోడ్లన్నీ మీరు మరమ్మత్తులు చేయండని చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ పత్రికా ముఖంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మమ్మల్ని ఎత్తిచూపడానికి మీరు ప్రతిపక్షంలో లేరు అధికార పక్షంలో ఉన్నారు. అది గుర్తుంచుకోండి. అలాగే కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాకీలు చెల్లిస్తే వారు ముందుకు వచ్చి వీటిని మరమ్మతులు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న ఒక ప్రెస్ నోట్ తోనే భయపడి నాయకులు కాంట్రాక్టర్లతో సమీక్షలు పెట్టి రేయింబవళ్ళు కష్ట పెట్టించి రోడ్లు వేయించారు. ఇదే సంగతి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ మీకు నెల రోజులు గడువు ఇచ్చారు. అప్పుడు గుర్తుకు రాలేదా నియోజకవర్గంలో మరెన్నో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. దాని గురించి మీకు పట్టదా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మేము గుంతల పడ్డ రోడ్లు చూపిస్తాను. మీరు శ్రమదానం చేయండి కూలీ ఇస్తాము అని మాట్లాడటం మీకు సభ్యతగా ఉందా, అని నేను ప్రశ్నించుకున్నాను. పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఈ సమస్యలన్నింటినీ తీరాల్సింది పోయి వాటిని మాకు చూపిస్తాను అనటం మీకు నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతమాత్రం బాధ్యత ఉందో తెలియ పరుస్తుంది. అలాగే ఎలక్షన్ల ముందు దుద్దుకుంట పేరు మీద వాటర్ సప్లై చేసిన మీరు ఎలక్షన్ల అయిపోయిన తర్వాత కనీసం సత్యసాయి వాటర్ సప్లై ఉద్యోగులకు ఐదు నెలల నుండి జీతాలు అందకుండా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నుండి రావలసిన బిల్లులు ఇవ్వకుండా దాని బాధ్యతలు చూస్తున్న L&T కంపెనీ వారు వెనక్కి వెళ్లేలా చేశారు. ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవడం కోసం టెండర్లు వేస్తే కనీసం ఒక్క కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి. ముందు కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వచ్చేలా చూడండి వారి పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రం దివాలా తీసే స్థితిలో ఉంది ఇది మీరు గుర్తించకపోతే మీ పార్టీకి 2024లో ప్రజలు బుద్ధి చెబుతారు అని విన్నవిస్తున్నాము. మీలాంటి అవినీతిపరులు పవన్ కళ్యాణ్ గారికి కూలీ ఇస్తామని దిగజారుడు రాజకీయాలు చేయోద్దని, మీకు పవన్ కళ్యాణ్ గారినీ విమర్చించే స్థాయి లేదని హెచ్చరించారు... ఇలాంటి నీచపు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచి నీరు, ఉచిత వైద్యం, రోడ్లు వేశారు, కానీ మీ నాయకులు పుట్టపర్తి నియోజకవర్గంలోనీ ఆరు మండలాలలో మీరు చేసింది ఏమి లేదని మాదాసు నరసింహ అన్నారు.
All Rights Reserved By Janaswaram News.