Logo
Date of Publish : 12 March 2022, 5:07 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ “ఛలో అమరావతి” పోస్టర్ విడుదల చేసిన జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

   నెల్లూరు, (జనస్వరం) : మార్చి 14న జనసేన పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న భారీ బహిరంగ సభ వివరాలు తెలిపే "ఛలో అమరావతి" పోస్టర్ ను నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగసభలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని కోరారు. సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారన్నారు. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభకు చేరుకునేందుకు పార్టీ తరఫున ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఉన్నామన్నారు. మూడేళ్ళ ఈ ప్రభుత్వ కాలంలో ప్రజలు అన్ని రకాలుగా మోసపోయారన్నారు. రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ అనే శక్తి వైపు ఆశతో చూస్తున్నారని 14వ తేదీన జరిగే బహిరంగ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అన్నారు. ఇప్పటికే అనుభవం పేరుతో చంద్రబాబుకి, అవకాశం పేరుతో జగన్ రెడ్డికి అధికారం ఇచ్చి రాష్ట్ర ప్రజలు నష్టపోయారని ఇప్పుడు 2024 లోపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జీ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, కోవూరు నియోజకవర్గ నాయకులు దాడి అజయ్, వీరమహిళలు షేక్ ఆలియా, శిరీష రెడ్డి, నాయకులు శ్రీకాంత్, షేక్ అక్తర్, కుక్క ప్రభాకర్, అనిల్ మరియు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com