
నెల్లూరుసిటీ, (జనస్వరం) : ప్రభుత్వ విధానాలతో ప్రజలు విలవిలలాడుతున్న పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, ఇసుక నుంచి మద్యం వరకు ఇంధర ధరల నుంచి ఆధ్వాన్నప్పు రోడ్ల వరకు మితిమీరిన ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని జనసేన పార్టీ నెల్లూరు నగర నాయకులు శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాల హామీతో గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం ప్రజల నవరంధ్రాలకు తూట్లు పెడుతోందన్నారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అంటూ విద్యుత్ వినియోగదారుల నెత్తిన మరో భారాన్ని వైసీపీ మోపిందన్నారు. సోమవారం నెల్లూరు సిటీ పరిధిలోని 10వ డివిజన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన చేతులు మీదగా ప్రారంభించారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్నన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ భూములు, భవనాలు తాకట్టు పెట్టడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. రానున్నది జనసేన ప్రభుత్వమేనని, పార్టీ రోజు రోజుకీ బలపడుతున్న తీరే అందుకు నిదర్శనమన్నారు. ప్రతి డివిజన్ లో ఏర్పాటవుతున్న పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపదతాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాకు మురళి రెడ్డి, శ్రీమతి శిరీష రెడ్ది, శ్రీ జీవన్, శ్రీ హేమంత్ రాయల్, శ్రీ నాగరాజు, శ్రీ చరణ్, శ్రీ ఈశ్వర్, శ్రీ సంతోష్, శ్రీ మనోజ్, శ్రీ వంశీ, శ్రీ వినయ్, శ్రీ దయాకర్ మరియు10 వ
డివిజన్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.