
పాలకొండ నియోజకవర్గంలో ఇటీవల మరణించిన తండ్రి రౌతు లక్ష్మినాయుడు శ్వాసకోశ సంబంధమైన వ్యాధి తో మరణించి వారం రోజుల గడవక ముందే తల్లి లక్ష్మి మరణం పొందారు. ఆ చిన్నారుల జీవితం లో తేరుకొలేని లోటుగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తనదైన సేవా దృక్పదంతో ఆ చిన్నారులకు మనోధైర్యం ఇస్తూ మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను మీ వెన్నంటే ఉంటానన్ని భరోసా ఇస్తూ ఓ 50 కేజీలా బియ్యం నెలకు సరిపడా సరుకులు 4000 రూపాయిలు ఇస్తూ ఆ చిన్నారులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టం లోనైనా మేమున్నాం అంటూ సేవ చేసే పనిలో ఎంతటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటాం అంటూ మీకు భరోసా ఇస్తూ మీవెంటే ఉంటాను అని తెలిపిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అశాయానుసారం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇకముందు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయుకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొర్ల మన్మధ, వజ్రగడ రవికుమార్, పొట్నురు రమేష్, సతివడా వెంకటరమణ, గర్భపు నరేంద్ర, మండల కిరణ్ కుమార్, మండగి యోగేష్, బిల్లకుర్థి రమేష్, గేంబలి సంతోష్, అచ్యుత్ గోవిందా, చిన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు.