Logo
Date of Publish : 21 April 2022, 2:53 pm
Editor : Sake Naresh

ఎమ్మెల్యే కన్నబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రెండవ విడత కౌలు రైతుల భరోసాయాత్రపై రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రైల్వేకోడూరు జనసేనపార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు స్పష్టం చేశారు. కౌలు రైతుల అకాల మరణం తీవ్ర బాధాకరమైన విషయమని ఆ రైతు కుటుంబాల తాత్కాలిక సంతోషం కోసం ఒక భరోసా కల్పించే నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు పశ్చిమగోదావరి జిల్లాలో ఏప్రిల్ 23వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలు ప్రారంభిస్తున్న సందర్భంగా రైతులు సంతోషంగా ఉన్నారని కన్నబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులంతా సంతోషంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదు. మేము చేస్తేనే రాజకీయం అనడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు కలిపి ఇచ్చే 30 వేల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఇచ్చే 37500 కలిపి చూపించడం హాస్యాస్పదం అన్నారు. మీ ప్రభుత్వ పాలనలో కౌలు రైతులు ఆనందంగా ఉండుంటే మరి మా సొంత నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇంత బాధ అని విమర్శించారు. రైతులకు న్యాయంగా వైసిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కౌలు రైతుల అకాల మరణం వారి కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించకుండా వారికి రావాల్సిన తక్షణ సహాయమును ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com