విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై జనసేన నాయకుడు ఈమని కిషోర్ దిగ్భ్రాంతి
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు కిషోర్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకొని, అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిన ఈ ప్రమాదంలో మన జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు అని, ఆరోగ్య మరియు అగ్ని మాపక శాఖల అధికారులు నిర్లక్ష్యం రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కనపడుతుంది అని హోటల్ యాజమాన్యాన్ని బలిపశువుని చేయటం సరికాదని, ఆస్పత్రి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని, అగ్నిమాపక అధికారుల వివరణ చూస్తుంటే ఆస్పత్రి యాజమాన్యాన్ని వెనకేసుకొస్తున్నట్టు ఉందని ఆయన తెలిపారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఆస్పత్రిగా మార్చటానికి అనుమతులు ఎందుకు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలానే ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగ్గయ్యపేటకి చెందిన బేతేస్థ ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ SR అబ్రహం గారు, వారి సతీమణి రాజకుమారి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము అని ఆయన తెలిపారు.